పోలీస్ తన వంటిపై యూనిఫాం ఉందని రెచ్చిపోయాడు. ఆ వ్యక్తిని చేతులతో గుద్దుతూ, చెంపదెబ్బలు కొట్టడం కనిపిస్తుంది. బాధితుడు నేలపై పడినా అతడిని వదలకుండా తన ప్రతాపాన్ని చూపించాడు.
Ghaziabad Cop: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఒక పోలీసు కానిస్టేబుల్ రెచ్చిపోయి సామాన్యుడిపై తన ప్రతాపం చూపించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో పోలీస్ తన వంటిపై యూనిఫాం ఉందని రెచ్చిపోయాడు. ఆ వ్యక్తిని చేతులతో గుద్దుతూ, చెంపదెబ్బలు కొట్టడం కనిపిస్తుంది. బాధితుడు నేలపై పడినా అతడిని వదలకుండా తన ప్రతాపాన్ని చూపించాడు. పోలీసు అని భయపడి చుట్టుపక్కల వారు కూడా బాధితుడిని రక్షించే ధైర్యం చేయలేకపోయారు.
ఈ సంఘటన ఘజియాబాద్‌లోని కవి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 14 న జరిగింది. వార్తల ప్రకారం ఇక్కడ ఏదో విషయంలో కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. దాన్ని పరిష్కరించేందుకు వచ్చిన కానిస్టేబుల్ ఏదో పెద్ద విషయం జరిగిందంటూ వాతావరణం సృష్టించాడు. దీని తర్వాత కానిస్టేబుల్ యూనిఫాం ధరించి ఒక వ్యక్తిని తన్నడం, కొట్టడం కనిపిస్తోంది. అతని కడుపు, ఛాతీపై తన్నాడు. వీడియోలో ఒక మహిళ అతన్ని చంపమని అడగడం వినబడుతుంది. అయితే కొంతమంది జోక్యం చేసుకుని పోలీసును ఆపమని కోరుతున్నారు.
ఈ సమయంలో అక్కడ ఉన్న ఎవరో ఈ సంఘటన పూర్తి వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసు యంత్రాంగం ఈ విషయాన్ని గుర్తించి చర్యలు తీసుకుంది. సదరు కానిస్టేబుల్ రింకు రాజౌరాను సస్పెండ్ చేసింది. నిందితుడు కానిస్టేబుల్ రింకు రాజౌరాను మధుబన్ బాపుధామ్ పోలీస్ స్టేషన్‌కు అటాచ్ చేశారు. వీడియో బయటకు రావడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. నిందితుడు కానిస్టేబుల్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశామని.. అతడిపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించామని పోలీసులు చెబుతున్నారు.
विवाद था पारिवारिक और वर्दीधारी ने जो माहौल बनाकर पिटाई की, उससे पुलिस की साख पर बट्टा लगा। वर्दी के रुआब में बेअन्दाज हुए सिपाही को न केवल निलंबित किया गया, बल्कि मामला भी दर्ज किया गया है। घटना ज़िला ग़ाज़ियाबाद की है। pic.twitter.com/CTFdZnw02r