»Father And Son Died Of Snakebite At Kamareddy District Telangana
Snakebite: పాముకాటుతో తండ్రి, కొడుకు మృతి
కామారెడ్డి జిల్లాలోని మూడుమామిళ్ల తండాలో నిన్న రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు పాముకాటుతో మృత్యువాత చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఓ ఫ్యామిలీలో రోజు మాదిరిగానే భోజనం చేసిన తర్వాత వారంతా పడుకున్నారు. కానీ అర్దరాత్రి అయిన తర్వాత నెమ్మదిగా వారి ఇంట్లోకి పాము ప్రవేశించింది. ఆ తర్వాత అక్కడే పడుకున్న చిన్నారి విక్కును(11) కాటేసింది(snakebite). దీంతో ఆ క్రమంలో గమనించిన అతని తండ్రి అప్రమత్తమై దానిని చంపేందుకు ప్రయత్నించారు. కానీ ఆ పాము అతనిపై కూడా బసలుకొట్టి కాటేసింది. దీంతో అతను కూడా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతని భార్య అరుపులు చేయడంతో పక్కింటి వారు వచ్చి వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ క్రమంలో వారు చికిత్స పొందుతూ మృత్యువాత చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా(kamareddy district)లోని మూడుమామిళ్ల తండాలో నిన్న జరిగింది.