TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ ‘X’ వేదికగా స్పందించారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఎజెండా అని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి కేసులో హరీష్‌కు నోటీసులు ఇవ్వడం రేవంత్ సర్కార్ దిగజారుడుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.