భారత టీ20 ఆటగాళ్లు కొంతమంది ప్రకృతిని ఆస్వాదించడానికి విదర్భ ప్రాంతంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి సఫారీకి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను సంజ్ శాంసన్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశాడు. జనవరి 21 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో వారు నాగ్‌పూర్ చేరుకున్నారు. ఈ క్రమంలో సఫారీకి వెళ్లి ఎంజాయ్ చేశారు.