PLD: భోగి మంటల్లో వైసీపీ నేతలు కాల్చాల్సింది జీవోలను కాదని, తమలోని విద్వేషం, వినాశనకర ఆలోచనలని చిలకలూరిపేట MLA పుల్లారావు బుధవారం అన్నారు. ఢిల్లీలో పీపీపీని సమర్థించి, ఇక్కడ వ్యతిరేకించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. జీవోలు కాల్చినంత మాత్రాన పేదలకు అందే వైద్య సేవలు ఆగిపోవని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో విషప్రచారం చేస్తున్నారన్నారు.