VSP: సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సంక్రాంతి కానుక హామీ ఏమైందని కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ ప్రశ్నించారు. విశాఖలోని 31వ వార్డు సరస్వతి పార్క్, కనకల దిబ్బ వీధిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.