KMM: మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆరు నెలల వేతనాలు, నిర్వహణ బిల్లులు, పది నెలల కోడిగుడ్ల బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పిన్నింటి రమ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కార్మికుల బకాయిలు చెల్లించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు రాణి, సుగుణ ఉన్నారు.