ASR: జీకే వీధి మండలం ధారకొండ పంచాయితీ పెట్రాయి గ్రామానికి చెందిన కొర్ర దేవి (8) ఇంట్లో చలి మంట కాగుతుండగా ప్రమాదవశాత్తూ గౌనుకు నిప్పంటుకుని గాయాలపాలైంది. కుటుంబసభ్యులు వెంటనే స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను అంబులెన్సులో చింతపల్లి పీహెచ్సీకి తరలించారు.