NZB: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో ఆదివారం జిల్లా మీసేవ అధ్యక్షుడు ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని వివిధ గ్రామాలు, మండలాల నుంచి వచ్చిన 151 మంది మీసేవ నిర్వాహకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ అనంతరం సితారి క్షవీన్ రాజ్ నూతన అధ్యక్షుడిగా గెలుపొందారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శ్యాంబాబు ఉన్నారు.