VKB: జిల్లా కోటపల్లి మండలంలోని కరీంపూర్ పంచాయతీ కార్యదర్శి ఖాజా హామీదుద్దీన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ సస్పెండ్ చేశారు. రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు విధులు సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.