KMR: ఏకాగ్రీవ సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. మాచారెడ్డి మండలంతో పాటు బీబీపేట మండలంలో ఐదు గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకాగ్రీవం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం కామారెడ్డిలో వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.