»Man Kills Educated Wife On The Pretext Of Neglecting Him Anakapalle
Anakapalle: ఫోన్ పెట్టిన చిచ్చు.. భార్యను చంపిన భర్త
భార్య భర్తల బంధం కలకాలం నిలవాలి అంటే ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం సన్నగిల్లినప్పుడు వారి బంధానికి బీటలు వారుతాయి. దీంతో గొడవలు తలెత్తి జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులకు దారితీస్తాయి. అలాగే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తనను నమ్మి వచ్చిన అర్థాంగిని అంతం చేశాడు. తన భార్య డిగ్రీ వరకు చదువుకుంది.
Anakapalle: భార్య భర్తల బంధం కలకాలం నిలవాలి అంటే ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం సన్నగిల్లినప్పుడు వారి బంధానికి బీటలు వారుతాయి. దీంతో గొడవలు తలెత్తి జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులకు దారితీస్తాయి. అలాగే భార్య(Wife)పై అనుమానం పెంచుకున్న భర్త తనను నమ్మి వచ్చిన అర్థాంగిని అంతం చేశాడు. తన భార్య డిగ్రీ(Degree) వరకు చదువుకుంది. కుటుంబ ఆర్థికపరిస్థితి బాగోలేకపోవడంతో ఒక ప్రయివేటు వస్త్ర దుకాణంలో ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలోనే ఫోన్(Phone) అవసరం ఉండి కష్టపడి కొనుక్కుంది. తనకు చదువు రాకపోవడం, భార్య ఉద్యోగం చేయడం, ఫోన్ మాట్లాడటం వంటివి చూసి అనుమానం పెంచుకున్నాడు భర్త. దీంతో భర్తపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.చీడిక గ్రామానికి చెందిన నాగేంద్రకు మరదలు వరుసయ్యే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన రాజ్యలక్ష్మి(32)తో 2013లో పెళ్లి జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పటివరకు కాపురం బాగానే సాగింది. నాగేంద్రకు చదువు అబ్బలేదు. పనిపాట లేకుండా గాలికి తిరగడంతో కుటుంబ పరిస్థితులు దారుణంగా మారాయి. దీంతో ఏం చేయాలో తోచక డిగ్రీ వరకు చదువుకున్న రాజ్యలక్ష్మీ ఒక వస్త్ర దుకాణంలో పనికి చేరింది. అవసరార్థం ఫోన్ కూడా కొనుక్కుంది. భార్య ఉద్యోగం చేయడం, ఆమె ఫోన్ లో మాట్లాడటంతో భార్యపై నాగేంద్రకు అనుమానాలు పెరిగాయి. ఇరువురి మధ్య గొడవలు జరగడం మొదలైంది. ఈ క్రమంలోనే రాజ్యలక్ష్మీ భర్త వేధింపులు తట్టుకోలేక తన పుట్టింటికి పోయింది. పెద్దలు నచ్చజెప్పి ఇద్దరినీ కాలిపారు. ఈ క్రమంలోనే భార్యతో ఉద్యోగం మాన్పించాడు.
తన కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇప్పటికే భార్యపై అనుమానంతో ఉన్న నాగేంద్ర ఆమెపై బలమైన ఆయుధంతో దాడి చేశాడు. తీవ్ర గాయంతో.. రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ నేరం చేసిన తర్వాత స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నాగేంద్ర లొంగిపోయాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. భార్యపై అనుమానంతోనే నాగేంద్ర ఈ హత్యకు పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు పోలీసు అధికారులు తెలిపారు.