TG: మంచిర్యాల జిల్లాకు చెందిన SBI బ్యాంకు ఉద్యోగి రవీందర్ ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై నేరస్తుడిగా మారాడు. రూ.40 లక్షల అప్పులు తీర్చడానికి తాను పనిచేస్తున్న బ్యాంకులోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. అతను తాకట్టులో ఉన్న బంగారం దొంగిలించి, ఇతరుల సహాయంతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టాడు. నకిలీ రుణ ఖాతాలు సృష్టించి రూ.1.58 కోట్లు అక్రమంగా తీసుకున్నాడు.