TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో సీఎం రేవంత్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, సంతోషాలతో ఉండాలని రేవంత్ తన X హ్యాండిల్లో ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం కోసం రాహుల్ కృషిని కొనియాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ను బలోపేతం చేయడంలో ఆయన మార్గదర్శనం కీలకమని రేవంత్ పేర్కొన్నారు.