VZM: జిల్లా వ్యాప్తంగా శనివారం యోగా మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు జేసీ సేతు మాధవన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని సచివాలయాల పరిధిలో సన్నాహక యోగా అభ్యాసాలు నిర్వహించారు. ఈ డెమో యోగ సాధన కార్యక్రమం వల్ల అంతర్జాతీయ యోగ దినోత్సవం కార్యక్రమంలోని లోటుపాట్లను ముందస్తుగా గుర్తించేందుకు దోహదపడుతుందన్నారు.