NZB: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి ఆదివారం సాయంత్రం బాధితులకు మొబైల్ ఫోన్లు అందజేశామని సీఐ సత్యనారాయణ తెలిపారు. మొబైల్ ఫోన్లు చోరీకి గురైతే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు మంజునాథ, విట్టల్, పోశెట్టి, కృష్ణ, సాయన్న సీఐ సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.