NRML: శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. సంక్రాంతి పండుగకు పాఠశాలలు, హాస్టళ్లకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లకు బయలుదేరారు. దీంతో నిర్మల్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు ప్రయాణికులు చేరుకోవడంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికులకు సరిపోయే బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు.
Tags :