NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో కోతులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన దివ్యాంగుడు కొత్తసాయి యాదవ్ ఇంటిపై కప్పును కూలగొట్టి భారీ నష్టాన్ని మిగిల్చాయి. కోతుల దాడితో ఇంట్లో ఉన్న మహిళ భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు కోతుల నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.