గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయి పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదే పనిగా కూర్చొని పనిచేయడం వల్ల ఆరోగ్యం హరించుకుపోతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, అధిక బరువు ఇలా చాలా సమస్యలు చుట్టుముడతాయి. అన్నింటికీ మించి గుండె ఆరోగ్యం చతికిలపడుతుందని, గుండెపోటు ముప్పు కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.