AP: సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లోని అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాచవరం మండలం మేఘవరంలో 13.80 సెంట్లు, పిన్నెల్లి గ్రామంలో 3.89 సెంట్లు.. మొత్తం 17.69 సెంట్ల భూములను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. కాగా, పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ రైతులకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో 20 ఎకరాలు కొనుగోలు చేసినట్లు అధికారుల సర్వేలో తేలింది.