AP: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రకాశం, కడప, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. వర్షాల నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని స్కూళ్లకు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.