ఏడాదిపాటు ఆటకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మైదానంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. టీమిండియాలోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న షమీకి BCCI రెండు కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. మెడికల్ టీమ్ ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆధారంగానే నిర్ణయం తీసుకుంటుంది. షమీ అధిక బరువు ఉన్నాడని, ఆసీస్ పర్యటనకు వెళ్లాలంటే బరువు తగ్గడంతోపాటు పూర్తి ఫిట్నెస్ సాధించాలని BCCI అధికారి ఒకరు తెలిపారు.