AP: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) సర్వే రేపటి నుంచి ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 వరకు ఈ సర్వే కొనసాగుతుంది. రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో రాష్ట్ర పరిశ్రమలశాఖ ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేకు ‘ఎంఎస్ఎంఈ సర్వే అండ్ సపోర్ట్’ అనే ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ సర్వే నిర్వహించనున్నారు.