ఏలూరు: జిల్లాలో DSC పరీక్షకు హాజరయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తామని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కృపావరం బుధవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు వెబ్సైట్లో డిసెంబర్ 12లోగ దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తును ఆఫీస్ అఫ్ ది డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అఫ్ మైనారిటీస్ భవానీపురం విజయవాడకు పంపాలన్నారు.