CTR: బంగారుపాళ్యం మండలంలోని దేవరకొండ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని అటవీశాఖ బీట్ అధికారి రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. జలకంఠేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు, గోశాల వద్ద ఉన్న పశువుల కాపరులను వారు అప్రమత్తం చేశారు. ఒంటరిగా ఎవరూ వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు.