TG: కామన్వెల్త్ మీడియేషన్ ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్ 2024కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీతో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని సీఎం వెల్లడించారు. హెల్త్‌కేర్, బయో టెక్నాలజీ పరిశ్రమలకు హైదరాబాద్ పవర్‌హబ్ అని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని అన్నారు. కానీ, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారిందన్నారు.