AP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడుతూ శాసనసభలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘గిరిజనుల పక్షాన పోరాటం చేసిన అల్లూరి బ్రిటీషర్లకు ముచ్చెమటలు పట్టించారు. చింతగొంది, కృష్ణదేవి పేట, రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లపై దాడి చేసి బ్రిటీషర్ల గుండెళ్లలో రైళ్లు పరిగెట్టించారు’ అని అన్నారు.