ఆస్ట్రేలియాలోని దేశవాళీ మ్యాచ్‌లో ప్రమాదం జరిగింది. మ్యాచ్‌కు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించిన టోనీ డి నోబ్రెగాకు బాల్ తగిలి తీవ్ర గాయమైంది. దేశవాళీ మ్యాచ్‌లో సీనియర్ అంపైర్ టోనీ విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా బ్యాటర్ స్ట్రెయిట్ డ్రైవ్ చేయగా.. బంతి అంపైర్‌కు నేరుగా ముఖం మీద తలిగింది. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడిని అబ్జర్వేషన్లో పెట్టినట్లు వైద్యులు వెల్లడించారు.