వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సీక్రెట్‌గా చాటింగ్ చేయలనుకుంటున్న వారి కోసం చాట్ లాక్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సీక్రెట్ కోడ్‌తో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని యాప్‌లో కనిపించకుండా కూడా చేయొచ్చు. మీ సీక్రెట్ చాటింగ్స్ ఓపెన్ చేయాలంటే కోడ్ ప్రతి సారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ సీక్రెట్ కోడ్‌ను మరిస్తే మాత్రం ఆ చాట్‌ను రికవర్ చేయడం చాలా కష్టం.