NDL: మహానంది మండలం బోల్లవరం గ్రామంలో రోడ్డెక్కి డ్రైనేజీ నీళ్లు పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బొల్లవరం గ్రామ ఊరు సెంటర్లో మ్యాన్ హోల్ బ్లాక్ కావడంతో మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, అదే విధంగా దేవాలయం కూడా ఉన్నందున కార్తీకమాసం దేవాలయానికి వెళ్లాలన్న ప్రజలు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు.