AP: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం బేసిక్ ప్రైస్ ఖరారుకు టెండర్ కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీకి ఛైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సునీల్ చౌదరిని నియమించింది. అలాగే, మాచారావు, బీఆర్ మీనా కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ మద్యానికి కనీస ధరను నిర్ణయించనుంది. మద్యం కొనుగోలుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు సిఫార్సు చేయనుంది. కొత్త బ్రాండ్లకు MRPలు ఖరారు చేయడంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.