స్వీడన్లో లింగ సమానత్వ మంత్రి పౌలీనా బ్రాండ్బర్గ్కు ‘బనానా ఫోబియా’ ఉందనే విషయం మళ్లీ వైరల్ అవుతోంది. ఆమె అధికారిక పర్యటనల సందర్భంగా ఎక్కడా అరటిపండు కనిపించకూడదని అధికారులు ఈ-మెయిల్ పంపించడంతో బయటపడింది. కాగా, తనకు ఈ ఫోబియా ఉన్నట్లు పౌలీనా గతంలోనే పోస్టు పెట్టి.. డెలీట్ చేశారు. కొందరికి చిన్నప్పుడే ఇలాంటి ఫోబియా వస్తుందని, దానికి కారణాలు తెలియవని నిపుణులు పేర్కొంటున్నారు.