మార్చి 2వ తేదిన తారకరత్న(Tarakaratna) పెద్ద కర్మ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పెద్ద కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఓ కార్డును కూడా కుటుంబీకులు ముద్రించారు. ఆ కార్డులో వెల్ విషర్స్ గా బాలక్రిష్ణ(Balakrishna), వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి(Vijaya sai reddy) పేర్లను ముద్రించడం విశేషం.
నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీ నాయకుడు నారా లోకేశ్(Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న(Tarakaratna) పాల్గొని గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ని బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 23 రోజుల పాటు తారకరత్న చావుబతుకుల మధ్య పోరాడారు. విదేశీ వైద్యుల సమక్షంలో తారకరత్న(Tarakaratna)కు ప్రత్యేక చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. తారకరత్న అంత్యక్రియలను బాబాయ్ బాలక్రిష్ణ(Nandamuri Balakrishna) దగ్గరుండి జరిపించారు. అలాగే విజయసాయి రెడ్డి(Vijaya sai reddy) కూడా బాలయ్యతో పాటు ఉన్నారు.
మార్చి 2వ తేదిన తారకరత్న(Tarakaratna) పెద్ద కర్మ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పెద్ద కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఓ కార్డును కూడా కుటుంబీకులు ముద్రించారు. ఆ కార్డులో వెల్ విషర్స్ గా బాలక్రిష్ణ(Balakrishna), వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి(Vijaya sai reddy) పేర్లను ముద్రించడం విశేషం.
తారకరత్న(Tarakaratna) అనారోగ్యానికి గురవ్వగా బాలక్రిష్ణ(Balakrishna) తల్లడిల్లిపోయారు. దగ్గరుండి అన్నీ తానై చూసుకున్నారు. తారకరత్న కోసం మృత్యుంజయ హోమం కూడా నిర్వహించారు. తారకరత్న కోలుకోవాలని ఎంతగానో ప్రార్థించారు. తారకరత్న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన అంత్యక్రియలు ముగిసే వరకూ కూడా బాలయ్యే దగ్గరుండి అన్నీ తానై చూసుకుంటూ వచ్చారు. అలాగే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి(alekhya reddy) విజయసాయి రెడ్డి బంధువు అని అందరికీ తెలుసు.
విజయసాయి రెడ్డి(Vijaya sai Reddy) కూడా రాజకీయ విభేదాలను పక్కనబెట్టి తారకరత్న(Tarakaratna) అంత్యక్రియల సమయంలో పెద్దరికాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు, బాలయ్య, ఎన్టీఆర్, ఇతర కుటుంబీకులంతా కలిసి తారకరత్న అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో విజయసాయి రెడ్డి వ్యవహరించిన తీరును చాలా మంది రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు హర్షించారు. ఇకపోతే ఇప్పుడు మరోసారి తారకరత్న(Tarakaratna) పెద్ద కర్మ సందర్భంగా బాలయ్య, విజయసాయి రెడ్డిలు కలవనున్నారు.