AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత స్పందించారు. పవన్ కళ్యాణ్ మాటలను బాధ్యతగా తీసుకొని కలిసి పనిచేస్తామన్నారు. నేరాల విషయంలో అందరికీ బాధ ఉందని, పవన్ బయటపడ్డారు.. మేము పడలేదని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ పకడ్బందిగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.