ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా ఇరాన్‌కు హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్ ఇటీవల చేసిన దాడికి తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ నేత ఖమేనీ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో అమెరికా ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సంయమనం పాటించాలని.. ప్రతిదాడికి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. టెహ్రాన్ ప్రతిదాడికి పాల్పడితే టెల్‌అవీవ్‌ను నియంత్రించలేమని అమెరికా పేర్కొంది.