AP: విద్యుదాఘాతం ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కరెంట్ షాక్ తగిలి నలుగురు మరణించటం బాధాకరమని అన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి కావాల్సిన వైద్య సేవలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.