ATP: శింగనమల నియోజకవర్గంలో కర్పూరం ఫ్యాక్టరీలో ప్రమాదానికి గురైన బాధితులను శనివారం అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరస నాయుడు, కేశవరెడ్డితో కలిసి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య యోగక్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.