AP: తిరుపతిలో మూడున్నరేళ్ల బాలికపై సుశాంత్(22) అనే దుర్మార్గుడు అత్యాచారం, హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలిక కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్కు సూచించారు. అటు హోంమంత్రి అనిత స్పందిస్తూ.. చాక్లెట్లు ఆశ చూపి హత్యాచారానికి పాల్పడటం హేయనీయమైన చర్య అని విచారం వ్యక్తం చేశారు.