TG: ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం కులగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 6 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. కులగణనపై రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఇంటింటి సమగ్ర కుటుంబ కులగణను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.