BNGR: భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ వైద్య సేవలు ప్రారంభమైన 2020 జూన్ 2వ తేదీ నుంచి ఈ ఏడాది అక్టోబరు మొదటి వారం వరకు 10లక్షల మందికి వైద్యం అందించినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ డా.వికాస్ భాటియా తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ 33 రకాల వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు.