తాను అధికారంలోకి వస్తే సరికొత్త ఆర్థిక అద్భుతాన్ని సృష్టిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆర్థిక విధానాల్లో కమలా హారిస్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ఆమె విఫల ఆర్థిక అజెండా కారణంగా ఇటీవలే ప్రైవేటు రంగంలో 30 వేల ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయాయని మండిపడ్డారు. తయారీ రంగంలో 50 వేల ఉద్యోగాలు కోల్పోయామని విమర్శించారు.