తెలుగు మాట్లాడే రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలు మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. పొట్టి శ్రీరాములు దీక్ష, ప్రాణత్యాగంతో 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అయితే ఆ తర్వాత తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొందరు దీన్ని వ్యతిరేకించినప్పటికీ విస్తృత చర్చల తర్వాత ఆంధ్రరాష్ట్రం, తెలంగాణ కలయికతో 1956 నవంబర్ 1న అంటే ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. 2014లో ఏపీ, TG విడిపోయాయి.