ELR: ధాన్యానికి మద్దతు పెంచాలని కైకరంలో మంగళవారం అన్నదాతలు ధర్నా చేశారు. అన్నదాతలను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో లక్ష 80 వేల ఎకరాలలో వరి పంట సాగు అవుతుండగా 5 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయిందన్నారు.