TPT: మధ్య ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట తిరుపతి జిల్లా న్యాయమూర్తులు గురునాథ్, కోటేశ్వరరావు, సూపర్డెంట్ శరవణ తదితరులు ఉన్నారు.