Tirumala News : అపచారం..తిరుమలలో 22 మద్యం బాటిళ్లు స్వాధీనం
తిరుమల(Tirumala)లో 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. తిరుమల(Tirumala) ఓల్డ్ బార్బర్ క్వార్టర్స్ లో సెబ్ అధికారులు 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
తిరుమల(Tirumala)లో 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. తిరుమల(Tirumala) ఓల్డ్ బార్బర్ క్వార్టర్స్ లో సెబ్ అధికారులు 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తిరుమల(Tirumala)లో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సుమలత, నాగేంద్ర ప్రసాద్, బిన్నీ, ప్రవీణ్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా అనంతపురం జిల్లా బత్తులపల్లి గ్రామానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వీరంతా కాంట్రాక్టు పనుల కోసం తిరుమల(Tirumala)కు వచ్చినట్లు సమాచారం.
తిరుమల(Tirumala)లో ఇటీవలె మాంసం తింటూ షికారీలు పట్టబడిన సంగతి తెలిసిందే. వారిని తిరుమల(Tirumala) విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో మాంసం, మద్యం వంటివి నిషేధం ఉన్నా కొందరు ఆ నియమాలు పాటించడం లేదు. నిబంధనలు పాటించకుండా కొందరు షికారీలు, స్థానికులు తరచూ అధికారులకు పట్టుబడుతున్నారు. దీనిపై వెంటనే స్పందించిన విజిలెన్స్ సిబ్బంది ఇద్దరు షికారీలను అదుపులోకి తీసుకుని వారిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించారు. ఇకపై ఎవ్వరైనా ఇలాంటి తప్పులు చేస్తే వారికి కఠిన శిక్ష పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
ఆ మధ్య తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ టైంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంపై, పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్ కెమెరాల నిషేధం ఉంది. అయినప్పటికీ ఓ వ్యక్తి శ్రీవారి ఆలయ డ్రోన్ షార్ట్స్ ను యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేశాడు. ఆ వీడియో కలకలం రేపింది. దీంతో శ్రీవారి భక్తులు, ఆగమ సలహాదారులు ఫైర్ అయ్యారు.
శ్రీవారి ఆలయానికి ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంది. విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. తిరుమల(Tirumala)లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడంతో టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాల పర్యవేక్షణను పెంచారు.