JN: జనగామ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్‌గా కోర్నేలు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని అందించారు. కోర్నేలు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, జిల్లాలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి పని చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు.