BPT: రేపల్లె పట్టణంలోని పెద్ద మసీదు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు మేరకు.. భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామానికి చెందిన గుఱ్ఱం శ్రీనివాస్‌ను లారీ వేగంగా ఢీ కొట్టింది. ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తమ్ముడు వేంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేశారు.