ప్రభుత్వరంగ టెలికం సంస్థ BSNL సరికొత్త లోగోతో యూజర్ల ముందుకొచ్చింది. ఇదివరకు రెడ్, బ్లూ రంగుల్లో ఉండే వక్రరేఖలను జాతీయ జెండా రంగులను పోలిన ఆకుపచ్చ, తెలుపు రంగుల్లోకి మార్చింది. భారతదేశం చిత్రపటాన్ని కూడా లోగోలో జోడించింది. భారత మ్యాప్ కాషాయ రంగులో కనిపిస్తుంది. BSNL కనెక్టింగ్ భారత్. సురక్షితంగా, చౌకగా, విశ్వసనీయంగా అని ఇంగ్లిష్ క్యాప్షన్ ఇచ్చింది. ఇదివరకు ‘కనెక్టింగ్ ఇండియా’ ఉండగా ఇప్పుడు ‘కనెక్టింగ్ భారత్’గా మార్చారు.