TG: నాలుగు ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల పెంపుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాలు చేయనుంది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సీట్లు కావాలని కళాశాలలు కోరగా.. JNTU అందుకు నిరాకరించింది. JNTU నిర్ణయంపై 4 ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టుకు వెళ్లాయి. విచారణ జరిపిన కోర్టు.. ఇంజినీరింగ్ కళాశాలలకు అనుకూలంగా నిన్న తీర్పు వెలువరించింది.