ఇవాళ్టి నుంచి రష్యాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. కజన్ నగరంలో ఈ నెల 24 వరకు ఈ సదస్సును ‘ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయటం’ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. కాగా.. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ నిన్న రష్యాకు చేరుకున్నారు.